#642
కఠిన హృదయమా
పల్లవి · Pallavi
కఠిన హృదయమా – కరుగవా దేవుని గడువులు గని వినవా – దెబ్బలు గలిగిన లోబడువా ||
చరణము 1
ఎన్నో గడువులు – ఎన్నోమార్లు ఎన్నో గడువులు – దొరికినను కన్నుమూసికొని – కదలుచునుందువు కనికరకరమునుగని మానవా ||కఠిన||
చరణము 2
సృష్టికర్తకు – మ్రొక్కెదవా! తన సృష్టిని గొని – పూజించెదవా సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలల్లా – మంత్రించెదవా ||కఠిన||
చరణము 3
నీరము రక్తముగా – మారినను భారముగా కప్పలు పేలు జోరీగలు గొప్ప – తెగులు వచ్చిన గుణపడెనా – ఫరోరాజు! ||కఠిన||
చరణము 4
దద్దరులై – బొబ్బలు పొక్కినను హద్దులేక – పిడుగులు పడిన గ్రుద్దినట్లు – వడగండ్లు కురిసినను – గుణపడెనా – ఫరోరాజు ||కఠిన||
చరణము 5
మిడుతల - దండులు చెలరేగి యా మిగిలిన - వాటిని మ్రింగినను వడివడి తడబడు - నంధకారమే వచ్చిన గుణపడె - నా రాజు ||కఠిన||
చరణము 6
ఘోష పెట్టి - దేశమెల్ల నేడువగ గుంపులుగా జ్యేష్ఠులు చావ రోషముతో - వెంబడించి నశించిరి దోషముకై - దుఃఖపడిరే ||కఠిన||
చరణము 7
నష్టము కష్టము కలిగినను మరి నరులును - దేవుడు చెప్పినను ఇష్టపడవు - రక్షింపబడుటకై ఇరుకుపడిన - నిరుకున జెడిన ||కఠిన||
చరణము 8
పాప ప్రతాపము - నెరుగుదువు దాని శాపము తాపము - నెరుగుదువా పాపము నొక్కపరి - పట్టినావా అది పట్టుబడి - కఠిన పరచు ||కఠిన||
చరణము 9
లోలోపలను - న్యాయమబద్ధము లోపము కలిగిన - మోసములో కాలయాపనచేయ - నుపాయములేల? వేషధారణయేల ||కఠిన||