#641

ఓ సంఘమా

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఓ సంఘమా – సర్వాంగమా – పరలోకరాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను – ఎదుర్కొనగా – నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా – వినుమా ||
చరణము 1
రాణి ఓఫీరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణావాద్య తరంగాలలో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైలాసుగంధాభిషేకము – నొందితివే సువాసనలదా ||ఓ సంఘమా||
చరణము 2
క్రీస్తు నిన్ను ప్రేమించెనని – తన ప్రాణాలర్పించెనని స్వస్థపరచి నిరోషముగా – ముడత కళంకము – లేనిదిగా మహిమ యుక్తంబుగా – నిలువగోరె యేసువా సహింతువా తీర్పునాడూ ||ఓ సంఘమా||
చరణము 3
చీకటిలోనుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు నెహ్రూ గుణాతిశయములను – ప్రకటించుటకై పిలిచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా – సజీవముగా నున్నావా ||ఓ సంఘమా||
చరణము 4
వ్యభిచారులు నరహంతకులు – పోకిరి చేష్టల డాంబికులు అబద్ధజనకుని యాసనము – యెజెబెల్ నీ మధ్య నివసించెనా – కృపావరములు – ఆత్మల భారములు ఉజ్జీవ దాహము కలదా ||ఓ సంఘమా||
చరణము 5
చల్లగానైనా వెచ్చగనూ ఉండని నీ కది మేలగును నులివెచ్చని స్థితి నీకున్న – బయటకు ఉమ్మబడెదవేమో నీ మనసు మార్చుకో – తొలి ప్రేమ కూర్చుకో ఆసక్తితోడ రక్షణ నొందు ||ఓ సంఘమా||
చరణము 6
కడపటి బూర మ్రోగగానే – కనురెప్పపాటున మారుదువా వడిగా మేఘాసీనుడై – నడియాకాశము పోగలవా గొఱ్ఱెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా – రారాజు నెదుర్కొనగలవా ||ఓ సంఘమా||