#640
ఓ యేసు నీ ప్రేమ ఎంతొ మహనీయము
పల్లవి · Pallavi
ఓ యేసు నీ ప్రేమ ఎంతొ మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది ||
చరణము 1
అగమ్య ఆనందమే – హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ||ఓ యేసు||
చరణము 2
సంకట సమయములో – సాగలేకున్నాను – దయచూపు నామీద అని నేను మొరపెట్టగా – వింటినంటివి నా మొఱ్ఱకు ముందే – తోడనుందునంటివి (2) ||ఓ యేసు||
చరణము 3
మరణాంధకారపు – లోయనే సంచరింపన నిరంతరమేసు – నాదు కాపరియై – కరము విరిచి నన్ను గాయుచు నడుపు – కరుణగల ప్రభువు (2) ||ఓ యేసు||
చరణము 4
కొదువ లెన్ని యున్న – భయపడను నేనిప్పుడు – పచ్చిక బయలులో పరుండజేయును – భోజన జలములతో తృప్తిపరచును – నాతో నుండును నేను (2) ||ఓ యేసు||
చరణము 5
దేవుని గృహములో – సదా స్తుతించెదను – సంపూర్ణ హృదయముతో సదా భజించెదను – స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు – హల్లెలూయా ఆమెన్ (2) ||ఓ యేసు||