#639

ఆహా.. ఆ... అంత్యతీర్పు నందున ... యేసే నీ

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

చరణము 1
ఓ మానవుడా నీ గతి ఏమౌనో తెలియదా యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... పల్లవి:అహహ..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే మహాభయంకరమో ...సింహంబుగా నుండు ||
చరణము 2
లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన ఏ కులజుడైనా నాటికి – తీర్పులో నిలచును ||అహహ||
చరణము 3
మృతులైన ఘనులు హీనులు – యేసయ్య యెదుటను ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగానే ||అహహ||
చరణము 4
గ్రంథాలు విప్పబడగా – గ్రంథాలలో వారి గ్రంథంబు బట్టబయలై – పొందుదురు తీర్పును ||అహహ||
చరణము 5
నరులెల్ల క్రియలచొప్పున – మరి తీర్పు పొందుదురు మరణము మృతుల లోకము – గురియౌను యజ్ఞానికి ||అహహ||
చరణము 6
ఈనాడు నీవు కూడను – యేసుని విడచినచో ఆనాడు నీవు కూడాను – అందుండి ఏడ్చెదవు ||అహహ||
చరణము 7
దేవుని జీవగ్రంథము – దేవుడు తెరచును ఎవ్వాని పేరందుండదో – వాడు అగ్నిలో బడును ||అహహ||