#63
ప్రత్యేక దేవునికి స్తుతి
పల్లవి · Pallavi
పరమపురి కల్పభూజ – నిరతభూ నరుల పూజ –యురుతరచిత మహిమతేజ – వరనుతి సలిపెదము రాజ || పరమ ||
చరణము 1
జనక సుత శుద్ధాత్మ – యను పేరిట ఏకాత్మ – ఘనతర సంరక్ష ప్రేమ – ననిపి మము గని కరుణించు || పరమ ||
చరణము 2
నీవే మా ప్రాపువంచు – నెరనమ్మి యుందుమంచు – భావంబున తలచువారి – పావనుల జేయు సదా || పరమ ||
చరణము 3
కలుషంబులను హరింప – నిల సైతానును జయింప – బలుమారు నిను దలంచ – బలము గల ప్రభుండ వీవే || పరమ ||
చరణము 4
ఈ లోక పాపనరులు – చాల నిను నమ్మి మరల – దూలిచే దారుణ సైతానును బడ ద్రొక్కి వేయు || పరమ ||
చరణము 5
అల్పా ఓ మేగయును – నాద్యంతంబులును – కల్పాంత స్థాయివైన – కర్తా కరుణించు మమ్మును || పరమ ||