#64
దేవుని ప్రేమ
పల్లవి · Pallavi
ఎంత ప్రేమించెనో దేవుడు మనపై – నెంత దయ చూపెనోవింతగల యీ దైవ ప్రేమను – శాంతమున ధ్యానింపరే || ఎంత ||
చరణము 1
పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లల మనబడుటకై –తన కుమారుని మరణ బలి రక్తమున మనలను స్వీకరించుకొనెను దీనిని చూడరే || ఎంత ||
చరణము 2
పెంటకుప్పమీద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనెత్తి మింటిపై –ఘనులతో కూర్చుండజేయ మనవంటి హేతువైన మనవంటి దేహము దాల్చి || ఎంత ||
చరణము 3
ద్రాక్షారసపు మధుర వరమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపరుండగా –ఈ క్షితి నా ప్రేమ ద్రాక్షారసముకంటే – దీక్షగ వేడి యపేక్షింపదగునా హా || ఎంత ||
చరణము 4
మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన – ఘనుడా కాశమునుండి మరలి వచ్చి –మన దైన్యదేహమును తన రూపముకు మార్చి – కొనిపోయి తన రాజ్యమును మనకియ్యును || ఎంత ||
చరణము 5
గట్టిగ మనమున నిట్టి నిరీక్షణ – పెట్టియున్న సత్ క్రైస్తవులారా ప్రభువట్టివాడొమనమునట్టివారుగ ప్రభుని – కట్టడలను మదిని బెట్టియుందము వేడకన్ || ఎంత ||