#62

అనంత సహాయుడగు దేవుడు

రచయిత: జాన్ చౌదరి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

చరణము 1
గతకాలములయందు – ఘనసహాయుడ దేవా – హితనిరీక్షణ నీవే – యెన్నెండ్లకైన –జుటిగా విసరిన గాడ్పులందు దుర్గంబవై – నిత్మాంత గృహమీవే – నిత్యుడౌ ప్రభువా || గత ||
చరణము 2
నీ సింహాసన ఛాయలో – సురక్షితముగ – వాసము చేయుదము – భవ్యగుణతేజా –నీ సుబాహువే చాలు – నిశ్చయ సురక్ష – వాసంబుగా నొప్పె – ప్రభువా ఘన దేవా || గత ||
చరణము 3
నగముల్ వరస నిలిచి – నగధరి నిర్మాణమగుటకు మున్నే యనంత –ప్రభువు నీవు – అగణిత వత్సరముల్ – నీవే మా – భగవంతుడవు నిన్ను ప్రణుతింతుము మేము || గత ||
చరణము 4
వేయి యుగములు నీకు – దెసగతించిన యొక్క – సాయంత్ర సదృశము –సవిత్రుడురు శోభాయుతముగ లేవక ముందు రాత్రిలో – ప్రహరము సుమీ యవి || గత ||
చరణము 5
గతకాలములయందు – ఘన సహాయుడ దేవా – హిత నిరీక్షణ నీవే – యెన్నెండ్లకైన –క్షితిజీవితాంతము – గతిగానుండుము దేవా – నితాంత గృహమీవే – నిత్యుడౌ ప్రభువా || గత ||