#629
ఆనంద యాత్ర
పల్లవి · Pallavi
ఆనంద యాత్ర – ఇది ఆత్మీయ యాత్ర యేసుతో – నూతన – యెరూషలేము యాత్ర ||
చరణము 1
యేసుని రక్తము – పాపముల నుండి విడిపించును వేరు నోళ్ళతో – స్తుతించినను – తీర్చలేము ఆ రుణమును ||ఆనంద||
చరణము 2
రాత్రియు – పగలును – పాదములకు రాయ్ తగలకుండ మనకు పరిచర్య చేయుట కొరకు – దేవదూతలు మనకుండగా ||ఆనంద||
చరణము 3
కృతజ్ఞత లేనివారు – వేలకొలదిగా కూలినను కృపా వాక్యమునకు – సాక్షులమై – కృప వెంబడి కృప పొందెదము ||ఆనంద||
చరణము 4
ఆనందం – ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై – ఆగమనాకాంక్షతో సాగెదన్ ||ఆనంద||