#630
ఆనందం
పల్లవి · Pallavi
ఆనందం – ఆనందం – దినదినం ఆనందం యేసు రాజు నా సొంతమాయెనే – ఈ లోకమందు సొంతవాడాయెనే నా మదిలో సొంతమాయెను (2)
అనుపల్లవి · Anupallavi
ఆ....ఆనందమే – పరమానందమే – ఇది నా గొప్ప భాగ్యమే ||ఈ లోకమందు||
చరణము 1
తొలి బాల్యవయసులో – నన్ను గుర్తించినాడు దూరబోయిన కనుగొన్నాడు (2) – తన ప్రాణమును నాకర్పించి – జీవం పొందుకొనుమని చెప్పెను ||ఆ....ఆనందమే||
చరణము 2
ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో – నన్ను విడువక కాపాడును నన్ను నమ్మి ఇచ్చిన బాధ్య – తను ప్రభువు వచ్చువరకు – కాచుకొందును ||ఆ....ఆనందమే||
చరణము 3
ప్రభువు వచ్చు దినమున – తన చేయి చాచి ప్రేమతో పిలిచి చేర్చుకొనును – ప్రభువు సమూహమందు అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్ ||ఆ....ఆనందమే||