#628
ఆనందమౌ ఆనందమాయెను
పల్లవి · Pallavi
ఆనందమానందమాయెను – నాదు ప్రియ కుమారుని యందు ||మహదానంద||
అనుపల్లవి · Anupallavi
నా తనయుని మాట వినండి – శబ్దమొక్కటి యా మేఘముల్లో ఉద్భవించె నద్భుతముగ ||మహదానంద||
చరణము 1
ప్రేమించుచున్నావు నీతిని – దుర్నీతిని ద్వేషించినావు – నీవు – అందుచే నీ తోటి వారికంటె – ఆనందతైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానంద||
చరణము 2
అంత్యదినముల యందున – ఆ వింత కుమారుని ద్వారా – ఈ మానవులతోడ మాట్లాడెను – సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ||మహదానంద||
చరణము 3
తనయుండే ఆ తండ్రి మహిమ – ఆ తత్వంబు రూపంబు తానె ఆ – మహాత్యమైనట్టి – మాటలచేత – సమస్తమును నిర్వహించు అందరిలో అతి శ్రేష్ఠుడాయె ||మహదానంద||
చరణము 4
నీవు నాదు కుమారుడవు – నిన్ను ప్రేమించి కన్నాను – నేను – నేడు దండిగ తనయుని ముద్దాడండి నిండుగ వాని నాశ్రయించుడి రండి రండి ధన్యులు కాండి ||మహదానంద||
చరణము 5
విజ్ఞాన సంపద లెల్లను – ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను – ఆ సంతోషమును పరిశుద్ధత – సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను ||మహదానంద||
చరణము 6
అందరికన్న నీవెంతొ – అతి సుందరుడవై – యున్నావు నీవు – నీ పెదవుల మీద పోయబడి – నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించును తండ్రి ||మహదానంద||
చరణము 7
దివ్య రారాజై కుమారుడు – ఒక్క వెయ్యేండ్లు పాలించును మహా – అంతము లేని రాజ్యమేలును – యెందరో జయంబు నొందుదురో అందరును పాలించెదరు ||మహదానంద||