#627

అంధుడా రావా అరమరయేల

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: రెండవ అనుబంధము · Open in the hymnal app

పల్లవి · Pallavi
అంధుడా రావా అరమరయేల అడుగో యేసయ్య! అయ్యో అడుగో యేసయ్య...
చరణము 1
నీతి సూర్యుడు నిర్మల జ్యోతి – నిన్ను వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ సిలువలో కరములు చాచి – కన్నీరునొలుకుచు నిన్ను బిలిచె... ||అంధుడా||
చరణము 2
మరణపు శక్తిన మారొని యేసు – మరణమునుండి జయమొందె పరమందలి తండ్రియు దూతలుగని – కరములెత్తి జయధ్వనులిడిరి... ||అంధుడా||
చరణము 3
ధైర్యము చెడెను సృష్టికి ఆ – దైవ మరణమును తిలకించా ధైర్యము చెడెను – అధికారులకును – దాతను చేరెను గరినంబా... ||అంధుడా||
చరణము 4
లోకపు జ్ఞానము వ్యర్థమని – ఇక శోక మొందకడి దినములని జాగినయెలా యేసును చేరి – జయమని పాడుము అభయమని... ||అంధుడా||
చరణము 5
పావన యేసుని పదముల చేరుము – పాపములను తొలగించు నిదె జీవము నిచ్చును భావము మార్చును – దేవ దేవుని కరుణ యిదే... ||అంధుడా||
చరణము 6
హల్లెలూయ పాటలు పాడుదము – ఆనందముతో ప్రభు చాటుదము అలరాకడకై తలెత్తుదము – ఆ ప్రభురాగా వెళ్ళుదము... ||అంధుడా||