#613
స్తుతిగానము
పల్లవి · Pallavi
దీవెనతో సెలవిమ్ము కర్తా – మాకు నీ – దీవెనతో సెలవిమ్ము కర్తా దీవించి క్షేమంబు – దీవులను దయచేసి – జీవ పోషణ వార్త – భావమున సమకూర్చి || దీవెనతో ||
చరణము 1
లోకమున నిన్ను వేడుకొని – మేము నీ – లోకమున కొనియాడడుకొని ఆకరంబగు దివ్య – లోకంబులో జేరి – యేకముగా స్తోత్రములు – నీకు చెల్లింపగ || దీవెనతో ||
చరణము 2
స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ – శుభ మిచ్చు – స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ స్తుతియించును సర్వ – క్షితి దివ్య సైన్యంబు – లతులితంబగు దేవుడని నిన్ను స్తుతియించు || దీవెనతో ||