#612
దైవాశీర్వాదము
పల్లవి · Pallavi
కలుగునుగాక – దేవా – కలుగునుగాక – కలుగునుగాక మా ఇలలో నిప్పుడు – విలువ లేని దయ – గల నీ దీవెన || కలుగును ||
చరణము 1
తనయుని కరుణయును – దండ్రి దేవు దయ – తనరు నాత్మ కృప తప్పక మాకును || కలుగును ||
చరణము 2
మనమున భక్తులు – మరువక యైక్యము – ఘనముగా బెంపగా – ఘన సహాయము || కలుగును ||
చరణము 3
ఇట్టి యైక్యమును – యేసునితో మరి – గట్టిగా పెంచిన – ఘన సౌఖ్యంబు || కలుగును ||