#614
ముగింపు పాట
పల్లవి · Pallavi
పంపుము దేవా – దీవెనలతోను – పంపుము దేవా పంపుము దయచేతను – పతిత పావన నామ – పెంపుగ నీ సేవ – ప్రియమొప్ప నొనరింప || పంపుము ||
చరణము 1
మా సేవ నుండిన – మా వెలు తులన్నియు యేసుని కొరకు నీ – వెసగ క్షమియించుచు || పంపుము ||
చరణము 2
వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి – దినదినము ఫలములు – దివ్యముగా ఫలియింప || పంపుము ||
చరణము 3
ఆసక్తితో ని – శ్చలనిశము సేవింప – భాసురంబగు నాత్మ – వాసి నెక్కంగా నిచ్చి || పంపుము ||