#603

క్రొత్త సంవత్సరము

రాగం: కాంభోజి · తాళం: త్రిపుట · రచయిత: పుлиపాక జగన్నాథము

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
క్రొత్త యేడు మొదలు బెట్టెను – మన బ్రతుకునందున – క్రొత్త మనసుతోడ మీరు – క్రొత్త యేట ప్రభుని సేవ – దత్తర పడకుండ జేయుట – యుత్త మోత్తమంబున్ జూడ || క్రొత్త ||
చరణము 1
పొందియున్న మేలు లన్నియు – బొంకులేక మదియందు స్మరణ చేయుడి ఇందు మీరు మొదలు బెట్టు – పందెమందు గెల్వ వలయు – నందముగను రవినిబోలి – నలయకుండ మెలయకుండ || క్రొత్త ||
చరణము 2
మేలు సేయ దొడరునొనరుగా – మీరు నెరుగునట్లు – కాలమంత నిరుడు గడచెగా ప్రాలుమాలి యుండకుండ – జాల మేలు సేయవలయు – జాల జనముల కిమ్మను – యేలు నామ ఘనతకొరకు || క్రొత్త ||
చరణము 3
బలము లేనివారమయును – బలమొందవచ్చు – గలిమి మీర గర్త వాక్కున నలయకుండ నలగకుండ మోదమొంది – బలమొసగు సర్వవిధముల – నెలమి మీరునొనర్చుచుండ || క్రొత్త ||
చరణము 4
ఇద్ధరిత్రినుండు నప్పుడు – రీశ్వరుని జనులు – వృద్ధిబొంద జూడవలయును బుద్ధి నీతి శుద్ధులందు – వృద్ధినొంద శ్రద్ధ జేయ – శుద్ధులైనవారిలోన ప్ర – సిద్ధులగుచు వెలుగవచ్చు || క్రొత్త ||
చరణము 5
పాపపంకమంటినప్పుడు – ప్రభు క్రీస్తు యేసు – ప్రాపుడైరి మీరు వేడుగా నేపుమీర దనదు కరుణ – బాపమంత గడిగివేసి – పాపరోగ చిహ్నాలన్ని – బాపివేసి శుద్ధి జేయు || క్రొత్త ||