#602

క్రొత్త వత్సరము

రాగం: రేగుప్తి (ఛాయ: హల్లెలూయ యని పాడుడి) · తాళం: ఆట · రచయిత: గొల్లపల్లి అంద్రేయయ్య

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఘనదేవ ప్రియ తనయుండా – జగద్రక్షా – వినుతి జేతుము నీ మహిమకన్ ఘనతరంబుగ – గత సంవత్సర – దినములన్నిట మాకు నీ భువి – ഘనసుఖము లొనరించి మరి – నూతనపు వత్సర మొసగినందుకు || ఘనదేవ ||
చరణము 1
అధిక ప్రేమలొసగుము – యేసు ప్రభు – కుదురుగా నీ వత్సరము ప్రథమ దినమున – మమ్ము నందరి – ముదముతో నిచ్చటకు చేర్చితి ప్రబలమగు సంగీత స్తుతులను – మిగులబొందుము యేసు రక్షకా || ఘనదేవ ||
చరణము 2
అంచితముగా నిచ్చటన్ – గూడిన సభలో – స్త్రీలన్ బురుషుల బిడ్డలన్ మంచి మార్గమునుంచి నీ – యత్యంత ప్రేమతో గావు మిలను చంచలులు గాకుండ నీ కృప – లుంచి మము రక్షించుమో ప్రభు || ఘనదేవ ||
చరణము 3
దీవించు ప్రభుయేసువా – సువార్తికులను – సావధానముగ భువిలో భావమందున నీ పదంబుల – సేవ బాగుగ జేయుచున్న నీ – జీవజల వాక్యంబులన్ ధరణి నిరతమున్ బ్రకటింప జేయుము || ఘనదేవ ||
చరణము 4
పరముండ ధరణి నీ సభలన్ – నూతనముగా – స్థిరపరిచి బలపరచుము సరసముగా నాశీర్వచనము – లెలమినిగా నొసంగుచున్న నూ – తన సహోదర ప్రియుల సమితిని – మరియును జేర్చుము నీ సభలలో || ఘనదేవ ||
చరణము 5
కరుణాళ శీ వత్సరము – క్రైస్తవ బడుల – ధరణిని బ్రబల జేయుమా సరిగానుపాధ్యాయులందరి – మరి మరి దీవించు ప్రభువా – స్థిరముగా పరమార్థములు బా – లకుకు గరపుచు నుండ జేయుము || ఘనదేవ ||
చరణము 6
భాసురంబుగ పరలోక – ప్రకాశుడా – దాసబృందములను గావు వాసిగా నరలోకమునని – వాసులగు మా దాసులందరి – దోషరాశిని ద్రోసి నీ కృప – లూపుచును రక్షించుమనిశము || ఘనదేవ ||