#601

సాంవత్సరిక కృతజ్ఞతార్పణము

రాగం: గుల్ రోజ్ (ఛాయ: దేవదాస పాలన) · తాళం: ఏక · రచయిత: మత్తయి సమూయేలు

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో – వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముడా – వదనంబులందు కో ప్రభో || వందనం ||
చరణము 1
ఇన్ని నాళ్ళు ధరణి మమ్ము బ్రోచియు – గన్న తండ్రి మించి యెప్పుడు గాచియు ఎన్నలేని దీవెన – లిడునట్టి యేసువా – యన్ని రేట్లు స్తోత్రములివిగో || వందనం ||
చరణము 2
ప్రాత వత్సరంపు పాపమంతయు – బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూతన వత్సరమునను నీదు – నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా || వందనం ||
చరణము 3
దేవా మాదు కాలుసేతులెల్లను – సేవకాలి తనువు దినము లన్నియు నీ వొసంగు వెండి, పసిడి – జ్ఞానమంత నీ – సేవకై యంగీకరించుమా || వందనం ||
చరణము 4
కోత కొరకు దాసజనము నంపుము – ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి – భీతిని బాపుము – ఖ్యాతి నొందు నీతి సూర్యుడా || వందనం ||
చరణము 5
మా సభలను పెద్దజేసి పెంచుము – నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకార – మంత ద్రోయుము – యేసు కృపన్ గుమ్మరించుము || వందనం ||