#604
వీడ్కోలు – ప్రభువు మీతో నుండుగాక
పల్లవి · Pallavi
దైవప్రేమ మనల నెప్పుడు బంధించుగా – దివిని భువిని దీన జనులను స్థిరముగా కాపాడుగా ||
చరణము 1
పరమతండ్రి గద్దెముందట ప్రార్థనలు మరిచేతుము – పలు విధముల మార్గములలో ప్రభువే తోడైయుండుగా || దైవ ||
చరణము 2
నిత్య ప్రభువు సత్య సేవను నిరతమును మదినుంతుము – నిలిచియుందుము క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా || దైవ ||
చరణము 3
మనము విడిచి వెళ్ళునప్పుడు మదిని కలుగును వేదన – మనసు హృదయము కలిసియుండగ మరల గలియుదము మెచ్చటొ || దైవ ||
చరణము 4
జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు – ఆదినుండి యిప్పుడు నెప్పుడు నవని పరమున జెల్లు గా || దైవ ||