#6

యెహోవా స్తుతి

రాగం: యమన్ · తాళం: ఆది

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
భీకరుండౌ మా యెహోవా పీఠముయెదుటను గూడరే ఏకమైసాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే ॥భీకరుండౌ॥
చరణము 1
మంటితోనే మమ్ము నెల్ల మానవులుగాసృజించెను ఇట్టి శక్తుండౌప్రభునే మెచ్చుగా మది నెంచుదము ॥భీకరుండౌ॥
చరణము 2
ఎరితోడు లేక మమ్ము సర్వేశ్వరుడుసృజించెను ధరణిన్ దా నొక్కడేమా దైవమని పూజింతుము ॥భీకరుండౌ॥
చరణము 3
పుట్ట గిట్టంజేయు దానై నట్టి దేవునిశక్తిని బట్టుగా లోకస్థులారాప్రస్తుతింపరే భక్తిని ॥భీకరుండౌ॥
చరణము 4
మేటి సంగీతంబులపై మింట నారవమొందను చాటరే వేవేలనోళ్లతో సన్నుతులు ప్రభు వందనము ॥భీకరుండౌ॥
చరణము 5
మిక్కిలి కష్టంబులతో మిత్తికినిపాలొందను దిక్కులేని గొర్రెలయట్లు తిరుగ జేర్పెను మందను ॥భీకరుండౌ॥