#7

దైవ నామ స్తుతి

రాగం: శంకరాభరణము · తాళం: తిశ్రజాతి ఏక · రచయిత: బొంతా శామ్యూయేలు

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

చరణము 1
నీతి సూర్య తేజమా జ్యోతి రత్న రాజమాపాతక జన రక్షకా పతిత పావన నామకా ॥నీతి॥
చరణము 2
మానవ సంరక్షకా దీన నిశ్చయ పోషకాదేవ మానవ నందనా దివ్య సుగుణ మందనా ॥నీతి॥
చరణము 3
ప్రేమ తత్వ బోధకా క్షేమదాత వీవెగాకామిత ఫలదాయక స్వామి యేసు నాయకా ॥నీతి॥
చరణము 4
పాప చింతలన్నిటిన్ పారదోలుము ప్రభువానీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్ ॥నీతి॥