#5
దైవ స్తుతి
పల్లవి · Pallavi
నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుడి మీ యాత్మతో నర్పించుడిదాతయౌ మన క్రీస్తు నీతినిదాల్చుకొని సేవించుడి ॥నీతి॥
చరణము 1
చదల బుడమియు రవియు జలధియునదులు గిరులును చక్కగాసదమలంబగు దైవ నామముసర్వదా నుతిచేయను ॥నీతి॥
చరణము 2
సర్వశక్తుని కార్యముల కీసర్వరాష్ట్రములు అన్నియుగర్వములు విడి తలలు వంచుచునుర్విలో నుతిచేయను ॥నీతి॥
చరణము 3
గీత తాండవ వాద్యములతోశ్రుతి పరచెడు సేవతోపాతకంబులు బాపదగినవాడా,ఎంతమాత్రము పాపము లేనివాడా,పాపులను పవిత్రపరచువాడను పేరు కలవాడా,దానసమూహమను సముద్రమునకు చంద్రుని వంటివాడా.ఇలను భక్తులు గూడి కొనియాడబలము గలిగిన దేవుని వెలియ స్తుతివే నోళ్లతోడను విసుగు జెందక చేయుడి ॥నీతి॥
చరణము 4
ఆత్మ నీవిక మేలుకొని శుద్ధాత్మయేసుని తండ్రిని త్రిత్వమగునా యేక దేవుని హర్షమున సేవింపవే ॥నీతి॥