#598
మితానుభవము – మద్యపానములోని మోసము
పల్లవి · Pallavi
మద్యపాన ప్రియులు గాకుండి – ప్రియులారా మీర – మత్తులోనే మునిగి పోకుండి మద్యపానము చేయువారికి – దథ్యముగా బ్రాప్తించు కీడులు – కొద్దియైనను రుచిని జూడగ – గోరదగదని తలచుకొనండి || మద్య ||
చరణము 1
రక్తమంతయు నడును సుమ్మండి – ప్రియులారా మీరు – శక్తిహీనులగుదురిల నుండి – శక్తిహీనుల గాక మరి మీరు – భక్తి దొలగి పోవునండి – ముక్తి మార్గము తెలియదండి – ముందు గతికి హీనమండి || మద్య ||
చరణము 2
బుద్ధి బలములు కొద్దివౌనండి – ప్రియులారా మీరు – మొద్దులగుదురనియు నమ్మండి – హద్దు మీరుచు తాగువారికి – గొద్ది కాలమె జీవమండి – శ్రద్ధగలిగి మద్యపానము – రద్దు చేయుట తగినదండి || మద్య ||
చరణము 3
మచ్చుకును ద్రాగబోకుండి – ప్రియులారా మీరు – తుచ్ఛమైన పనులు వీడుండి – హెచ్చుగా దీని ద్రాగువారికి – వచ్చు రోగము కుదరదండి – చచ్చుటకు ఇది హేతువని మది – గచ్చితముగాను తెలిసికొనండి || మద్య ||
చరణము 4
ఆలుబిడ్డల మేలుగోరుండి – ప్రియులారా వారి – మేలు గోరినన్ ద్రాగ బోకుండి – మేలు లెరిగి పిలుచు క్రీస్తుని – జాలి చూపులు తెలిసికొనండి – కాలయాపన చేయకుండి – కర్త యేసుని నమ్ముకొనండి || మద్య ||
చరణము 5
ఘన ధనములు నిలువబోవండి – ప్రియులారా నీచ – తనము మీకు మూలమౌనండి – తనవి తీర్చు మద్యమండి – ఘనుల కొంపలు కాల్చునండి – ఘనముగా ప్రభు వాక్యసారము – వినయమతితోడ గ్రోలరండి || మద్య ||