#597

సర్వ పరిశుద్ధుల స్మరణ – ఘనమగు పరిశుద్ధులు

రాగం: కల్యాణి (తాళం: ఎంతో సుందరమైనవి) · తాళం: త్రిపుట · రచయిత: బన్యన్ ஜோసెఫ్

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఎంతో ఘనమగువారలు – పరిశుద్ధులు – ఎంతో వినదగువారలు సంతసంబుగ వార – త్యంత ప్రేరణతోడు – సొంతవారిని సహ – సొంతంబుగ విడిచి చెంతజేరి యేసు ప్రభుని – చింతలేకను వెంబడించి – వింత పనులను జేసి బ్రతికి – అంతమువరకును నడచిరి || ఎంతో ||
చరణము 1
పేతురపోస్తలుండు – అతని సోదరు – డతి ప్రియుండంద్రెయయు – నీతి నియమములందు – ప్రీతితో బ్రతుకుచు – చేతి పనులయందు – శ్రద్ధతో నుండుచు ఖ్యాతి నొందిన యోహాను – అతని యన్న యాకోబుతోను – ప్రతిదినంబును కలిసి యుండుచు – భక్తి ప్రభువును వెంబడించిరి || ఎంతో ||
చరణము 2
ఆస్తి నిచ్చిన బర్నబా – ఆస్తిపరుడు – అపోస్తలులతో చేరెన్ – స్వస్థబుద్ధితోడు – ఆస్తివాడుట యెట్లో – క్రీస్తు సేవకొరకు – ఖర్చుపెట్టుట యెట్లో వాస్తవముగ నేర్పినాడు – ఆస్తిగలవారలకు నెల్ల – ప్రస్తుతంపు ఆస్తిపాస్తులు – ప్రభువు పనికియ్యవలెనని || ఎంతో ||
చరణము 3
సంఘమును హింసించిన – సంఘాభిమాని – సంఘ నాయకుడు పౌలు – సంఘముల నెన్నిటినో – చక్కగాను స్థాపించి – సంఘముల కుత్తరముల్ – సమయానుకూలముగ సంఘ కాపరులకును సహాయ – సరియగు సలహాలిచ్చి – సంఘములను ప్రభువు కొరకై స్థాపించి నిలుపలేదా || ఎంతో ||
చరణము 4
కన్యయైన మరియమ్మ – ధన్యురాలు – కన్యలకు తల్లులకును ఉన్న అన్యులకు నందరికి – ఆదర్శముగ నుండ – సన్యాసిను లెందరో – స్వామిని సేవించ – కన్యకలుగా నిలుచువారలు – కఠిన వ్రతములతోడు నుండి – ధన్యులగు పరిశుద్ధులతో – దైవ సన్నిధి నుండ జూపెను || ఎంతో ||
చరణము 5
మగ్దలేనే మరియ – మహినినున్న – మగువలలో కెల్లను – భగవంతుడైనట్టి – ప్రభువు యేసునుజేరి – నగము నెక్కెను తన – సొగసైన మార్పుచే – సాగి మొదటి సమాధి కడకు – స్వామి దర్శనమొంది మొదటి – వేగ వెళ్ళి శిష్యులకును – వెదకి సాక్ష్యమియ్యలేదా || ఎంతో ||
చరణము 6
మత్తయి మార్కులను వారు – మతమునందు – అతినిష్ఠగలవారలు – మత్తయి యూదులకై తన పుస్తకమును వ్రాసె – మార్కు గూడను తన సు – వార్తనందరి కిచ్చె వాస్తవంపు జీవితమును – వరుసగాను కలిగియుండి – క్రీస్తు ప్రభువును వెంబడింపగ – క్రొత్త లోకము చూపగలిగిరి || ఎంతో ||
చరణము 7
చూచినగాని – నమ్మనని – పేచిపెట్టిన తోమాయు – చాచి చేయు చూచి చక్కగా నమ్మెను – చూడకుండ నెడి లోక – వైద్యుండు నమ్మెను ఈ చొప్పున వీరిద్దరు – నీచజనుల కెల్లరకు దాము – బ్రోచు ప్రభువును చూపుచుందురు – బ్రోదిగా ప్రతిదినమునందును || ఎంతో ||
చరణము 8
ప్రభువా నీ పరిశుద్ధుల – బ్రతుకునందు – మా భాగ్యమునున్నదిహా – ప్రభువా వారి బ్రతుకు – ప్రబలమైన సేవ – విభవంగా గాంచి – విజయంబు గాంచుచు సభను యే రాణింపజేసి – సఫలముగ సేవించి బ్రతికి – ప్రభువా వారితో నేలునట్లు – అభయమియ్యుము మాకు దేవా || ఎంతో ||