#596
పరిశుద్ధ సిలువ పండుగ – సిలువ ఘనత
పల్లవి · Pallavi
సిలువేకదా చింత సదా వమహి – సిలువేకదా – మనకమోఘము – వెలలేని యాత్మ సంభోగము – విలసత్సంపరమ ద్రవ్య భాగ్యము – గుణత్యాగము ననురాగము మహి || సిలువే ||
చరణము 1
సిలువ బోధకు చెవి నొగ్గుమా – చెలువము గొన నాత్మ నొగ్గుము వల్ల నొప్ప నీకు సౌభాగ్యము – ఆత్మారోగ్యము నెంతో శ్లాఘ్యము || సిలువే ||
చరణము 2
చంపె నిందు ప్రభుని కర్తను – సంపాదించె నరు విముక్తుని బెంపారు నా నాంద సూక్తిని – ననురక్తిని నిత్యముక్తిని మహి || సిలువే ||
చరణము 3
పాపదావాగ్ని సంతప్తులు – స్వపుణ్య దుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన దీప్తులు – సుఖ ప్రాప్తులు సర్వ తృప్తులు మహి || సిలువే ||
చరణము 4
రంగొప్ప దీని ప్రసంగము – మంగళ గీత సారంగము అంగీకార హృత్పద్మ భృంగము – రక్షాశృంగము పాపభంగము మహి || సిలువే ||
చరణము 5
భయము లేదని చాటుచున్నది – ప్రియ యేసు వేడుకొమ్మన్నది దయ చూపు నీ కనుచున్నది – నిక్కమైనది చక్కనైనది మహి || సిలువే ||
చరణము 6
చేరవచ్చిన వారి భారము – ఘోరమైనను తద్విచారము ఆరూఢి పరమార్ధ సారము – సువిచారము సదాచారము మహి || సిలువే ||
చరణము 7
ఘనమైన రక్షక ధ్యానము మనల ముక్తికి చేర్చుమైనము – జనకృపాసుధా పానము దూతగానము తేజోమానము మహి || సిలువే ||
చరణము 8
ఇన్ని దినములూరుకుంటిమి – ఇప్పుడే రక్షణ కనుగొంటిమి కన్న తండ్రిని గొల్వకుంటిమి – కానకుంటిమి యెరుగకుంటిమి మహి || సిలువే ||