#59
O day of rest and gladness
చరణము 1
సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమావిచారమెల్ల తీర్చు దైవాది వారమాఈనాడు మేము కూడి దేవాాలయంబునమా ప్రత్యేక దేవ స్తుతి గావింతు మెంతయు.
చరణము 2
నీయందు సృష్టికర్త విశ్రామ మొందెనునీయందు యేసు క్రీస్తు మృత్యు బంధమునుతెంచుకొంచు తాను లేచి చావును జయించెనునీ యందు పావనాత్మ మాకియ్యబడెను.
చరణము 3
భూవాసు లీ దినంబు సంతోషపడుచుసువార్త విని, పాడి మా యేసు స్తోత్రముపితృ పుత్ర శుద్ధాత్మ త్రిత్వంబు దేవునిఉత్సాహ ధ్వనితోడ నెంతో నుతింతురు.