#58
ప్రభు దివసము (ప్రభుదినము)
పల్లవి · Pallavi
ఇది యెహోవా కలిగించిన దినము – సుదివసంబునను ఎల్లప్పుడు గడియలు –కొదువలేని దయ గుల్కెడు వానిని స్తుతించుడి || ఇది ||
చరణము 1
మోక్షము భూమియున్ మోదమొంది – నూతన మహిమ నొందు –లక్షల దూతలు గద్దె చుట్టు – నాక్రమింతురు గాక || ఇది ||
చరణము 2
అతడు దినమందు చెంతనొందునరులు – వితతి నుండి వేసి –వేగ వచ్చెను || ఇది ||
చరణము 3
ఆ పిశాచ రాజ్యము కూలినది – ఆ పరేశు విజయము ఈ దినమున || ఇది ||
చరణము 4
సేవక వరులు విలసింపంగ చేసి – యా పావనాద్భుతములన్ –బ్రోచు వరము చేయుదు || ఇది ||
చరణము 5
దావీదుని వర తనయుడై యభిషే – కావృతుడై రాజా –గ్రహణికి హోసన్నా || ఇది ||