చరణము 1
ఓ రక్షకా, నీ దివ్య నామము ఐక్యముతోను నుతియింతుముఆరాధనాంతమొందు వేళయందు అనుగ్రహించు నీదు దీవెన.
చరణము 2
గృహంబు చేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుము సదాఇచ్చట సేవ చేయు మమ్మును పాపంబు చేయకుండ గాయుము.
చరణము 3
మా చుట్టు నుండు మబ్బున ప్రభు నీ దివ్య కాంతిని మాకు నియ్యుమాపాపాంధకార బాధ నుండి నీ బిడ్డలమైన మమ్మును బ్రోవుమా.