#56
Abide with me, fast falls the eventide
చరణము 1
రాత్రియయ్యెను నన్నెన్నడు బాయకుధాత్రిపై చీకటులు గ్రమ్మెనుసహాయమేమియు లేనివారికిసహాయుడా, నన్ను బాసిపోకుమీ.
చరణము 2
ఏ కాలంబైన నీ సహాయము లేకపిశాచిని గెల్వజాలనులోక ప్రకాశుడా, నన్ను నడిపించుము.
చరణము 3
నా చెంత నీవు చేరియుండగాఏ చింతయైన నన్ను సోకునాఏ శత్రువైన నన్ను గెల్చునా?నా శైలమా, నన్ను బాసిపోకుమా.
చరణము 4
సమృద్ధుడవు సహాయుడాయెనుచావు జీవంబులందునైననుమా మధ్యమున సర్వేశా పాయకుము.
చరణము 5
రేవు నేను చేరబోవు వేళలోఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా?సమాధి నీకు జయమబ్బునా?నీవు తోడై నన్ను బాసిపోకుము.