#60

తండ్రియగు దేవుడు

రచయిత: పులిపాక జగన్నాథము

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
గొప్ప దేవా నాకు తండ్రివి – యాకాశమందు గొప్ప దేవా నాకు తండ్రివి –తప్పకుండా వచ్చు నీ దరికి యేసు నామమందు –గొప్ప కరుణ చేత నన్ను ఇప్పుడు చేర్చుకొనుము || గొప్ప ||
చరణము 1
నీవు మిగుల గొప్పవాడవు – నా సృష్టికర్తవు – ఈవు ఎల్లప్పుడు ఇచ్చువాడవు –భావమందు నిన్ను తలంచి – పావనాత్మ నాకు ఇచ్చి –జీవమార్గమందు నిలిపి – కావుమనుచు వేడుకొందు || గొప్ప ||
చరణము 2
చిన్నవాని నాలించి ప్రార్థన – ఈ లోకమందు – మునుపు దయను నిల్చినవాడవు –సన్నుతుడగు యేసు నీదు – సన్నిధి నున్నాడుగాన –నన్ను గని కరుణించుమనుచు – నిన్ను నమ్మి వచ్చుచున్నాను ఇప్పుడు || గొప్ప ||
చరణము 3
విలువ గల నీదు నాజల్ లు – నా హృదయమందు – బలు విధములతో తలచుచుందును –పలుకులందును పనులందును – బలము చూపి నిన్ను కొలిచి –ఇలను నిన్ను ప్రతిపరుతు – నలయక నీ కరుణ మెరయగ || గొప్ప ||
చరణము 4
మీది రాజ్యమందు చేర్చుము – కరుణాసముద్ర – బీదనైన నన్ను గరుణించి –సోదరులను గూడికొనుచు – మోదమొప్పగా నీదు సేవ –బాదుకొనుచునుందును నీ పాదపద్మములను బట్టి || గొప్ప ||