#571

దశమ భాగము

రాగం: హిందూస్థాని తోడి · తాళం: రూపకము · రచయిత: కూచిపూడి రాజరత్నము

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దశమ భాగము లెల్ల దేవునివి – ధారాళముగా నియ్య సమకూరుడి – పశువులు పైరులు దేవునివి – పసిడి లోహపు గనులన్ని దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి – భావించి కానుకలను నియ్యుడి ||దశమ||
చరణము 1
దేవుని దొంగిలించెదరా – దేవదేవుని మోసపుచ్చెదరా – భావించి మది నెంచి భయము నెంచి – ప్రార్థింప దలవంచి ప్రభు భాగమున్ – దేవాలయంబును పూర్ణంబుగా – దేదీప్యముగా నుండ సమకూర్చుడి ||దశమ||
చరణము 2
పరిశుద్ధ దేవుని మందిరమున్ – పరిపూర్ణముగాను యోజించుడి – పరిశుద్ధ భాగము విడదీయుడి – పాడిపంటలు నాస్తి దేవునివి – పదియవ భాగంబు దేవునివి – పరమాత్మ దీవెనలను బొందుడి ||దశమ||
చరణము 3
ప్రథమ ఫలములు దేవునివి – విదితంబుగా నియ్య మది నెంచుడి – సదమల హృదయములను బొందియు – ప్రథమ భాగము నెల్ల విడదీసి – ముదమున దేవుని కర్పించుడి – సదయుని దీవెనలొంద సమకూరుడి ||దశమ||
చరణము 4
ఆకాశపు వాకిండ్లు విప్పుదును – అధిక కృపలను గుమ్మరింతును – మీ కష్టఫలములను దీవింతును – భీకర నాశంబు దొలగింతును – మీ కానంద దేశమిత్రులన – నీకరుండౌ యెహోవా సెలవిచ్చెను ||దశమ||
చరణము 5
దినభోజన బిచ్చు దేవుని – ఘన సౌఖ్యముల నిచ్చు దేవుని – వినయంబుతో మదిని ధ్యానించుచు – దినభోజనంబులను భాగించుచు – మానక దేవుని కర్పించుడి – ఘనసేవ జయమొంద పనిచేయబూనుడి ||దశమ||