#572
ఔదార్యము
పల్లవి · Pallavi
స్తుతియు మహిమయు నీకే – క్షితి కన్ గవికన్ నీటి – వితతికన్ కర్తవై వెలయుమా దేవా – ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు – హితుడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము ||స్తుతియు||
చరణము 1
పసిడి వర్ణపుటెండ – భాగ్య ధారల వాన – విసరు మంచి గాలి – విరియు పుష్పములు – రసములుల్కు పండ్లు నీ – వర్మ్య ప్రేమను చాటున్ – ప్రసరించు కొలతలో – ఫలములందు వీవు ||స్తుతియు||
చరణము 2
నెమ్మదిగల యిండ్లు – నిజసౌఖ్య కాలములు – ఇమ్మహి ఫలియించు – నైశ్వర్యాధికములు – ఇమ్ముగా గలిగిన – హృదయమై వందనములు – బుణపడి యున్నాము నీకు ||స్తుతియు||
చరణము 3
దురితంబు లొనరించి – దౌర్భాగ్య స్థితి నున్న – ధరణికి నీ పుత్రున్ – ధర్మంబు చేసి – నరుల కీ ధర్మమున – కొరత దీర్చెడు సర్వ – వరములమర్చిన – పరమోపకారి ||స్తుతియు||
చరణము 4
జీవంబు ప్రేమను – జీవన గలిగించెడు – పావనాత్మను మాకై – పంపితివి దీవెనలేడురెం – టావరింపను మమ్ము – నీ విమలాత్మవా – నిని గుమ్మరించు ||స్తుతియు||
చరణము 5
నరులకు విమోచ – నము గలిగె పాపంబుల – పరిహారమాయె గృ – పాసాధనములు – దొరికె మోక్షాంశంబు – స్థిరమాయె మేము నీ – కొరకేమి తగగలము – పరిపూర్ణ జనకా ||స్తుతియు||
చరణము 6
మాకై వాడుకొనెడి – రూకల్ వ్యర్థం బగును – నీకై యుపయోగ నిచ్చు – నిఖిల వస్తువులు – నీకరంబగు నిత్య – శ్రేష్ఠ ధననిధియై పై – లోకంబు నందుండు – లోపంబు లేక ||స్తుతియు||
చరణము 7
జీవంబు వస్తువులు – శ్రేయస్సు దాన స్వ – భావంబు శక్తియు – భాగ్యంబులు నీవలననే లభ్యమై వెలయుచున్నవి – నీ వాసమే మాకు – నిత్యానందంబు ||స్తుతియు||