#570

దాతృత్వము

రాగం: నవరోజు (ఛాయ: యేసు క్రీస్తు దొరికెనేను) · తాళం: ఆది · రచయిత: జి. జాన్ తాతయ్య

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఇయ్యుడి మీకియ్యబడునని – ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు – నైయముతో తన – శిష్యవితతికి – నయముమీర జెప్పినట్లు ||ఇయ్యుడి||
చరణము 1
మొదట పరముని నంతునియ్యరే – సదమల హృదయంబుతోడ – సదయుడగు మన పరమతండ్రి – ముదముతోడ నంతయు నిచ్చున్ ||ఇయ్యుడి||
చరణము 2
శక్తికొలది నియ్యవలెనని – భక్తులందరితోడ జెప్పె – భక్తితోడ ప్రభుని సేవకు – శక్తికొలది నియ్యవలెను ||ఇయ్యుడి||
చరణము 3
కొంచెముగా విత్తెడివారు – కొంచెము సమకూర్చెదరు – హెచ్చువిత్తెడి వారికిలనూ – హెచ్చు ఫలములు నిండుగా దొరకున్ ||ఇయ్యుడి||
చరణము 4
సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ – వింతగా దీవెనలతోడ – అంతయు దయచేసి బ్రోచున్ ||ఇయ్యుడి||
చరణము 5
యేసు కృపను ఎరిగిమనుడి – యేసు మార్గమున నడువుడి – దాసుడై ధనమంత విడిచె – నీచులకొరకు నల మున్నె ||ఇయ్యుడి||
చరణము 6
పరమనిధులను నింపుకొనుడి – పరమ దేవుని ప్రేమను గనుడి – పరమ నిధులలో చీమెట్టుండదు – దొంగలసలే లేరు సుమండీ ||ఇయ్యుడి||