#569
దాతృత్వము – పుచ్చుకొనుటకన్న ఇచ్చుట ధన్యత
పల్లవి · Pallavi
ఇలన్ పుచ్చుకొనుట కన్న – నెంతో యిచ్చుటయే ధన్యమన్న – తులలేని భక్తి మీర – చెలువైన రక్తి దీర – నలలారు కూరిమితో మరి పేరిమితో – మెలంగినచో – నెలమిని ప్రభుండీడున్ బలు దీవెనల ||ఇలన్||
చరణము 1
పొడగాంచి చుక్క జ్ఞానులు – కరము – నడచినడచి కానుకల – నిడి బాలనృపుని మ్రోల – పడి మ్రొక్కి మోడ్చి కేల – గడు నిత్యభాగ్యమును సౌభాగ్యమును – గడించి కదా – వెడలి వరుందానందముతోడ ||ఇలన్||
చరణము 2
మును బీద విధవ చాల – భక్తి – నొనరంగ గుడి చందాల – దన జీవనంబైయుండు – నెనరాని కాసులు రెండు – మనసార నర్పించె సమర్పించె – మనశ్శాంతిని – గనియెను క్రీస్తుని వరముల బడసె ||ఇలన్||
చరణము 3
తనయీ నీదు హృదయంబు – నాకి – మమ్మన దేవుడె యనయంబు – మన చొప్పిన మన కానుకల – మారాడక మన సకల – మును నీయన కావలియున్ ప్రభుడాయవలెన్ – మనమందు బలరన్ – సణుగక గొణగక వర్ధిల్లు కొలది ||ఇలన్||