#567

గృహప్రవేశము – దేవా! మా ఇంటిని దీవింపుము

రాగం: ఆనందభైరవి (ఛায়: పోపోమ్ము ఓ లోకమా) · తాళం: త్రిపుట · రచయిత: దాసరి మోజెస్

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవా, మా గృహంబును – సదయుడవుండై – దీవించుటకు రారమ్ము – నీవే యిదానిని మా కెరవదాతవగుచు స – ద్భావముతో నిచ్చితివి – బహుమానముగా మాకు ||దేవా||
చరణము 1
మా యింటి యజమానుడు – గీవేసు నమ్మి – మా యింటి ప్రభుండ గీవే – పాయక మా యింట – భవదీయాభీష్టం బె – శ్రేయోదాయకముగుచు – సిద్ధింపబడును గాక ||దేవా||
చరణము 2
మా యాస్తిపాస్తులన్ని – మా కబ్బె భవ – దీయానుగ్రహ బలముచే – నీ యాననవానిని – నీ యలఘు సేవకై – న్యాయముగ నర్పింప – నీ యవే ఘన బుద్ధి ||దేవా||
చరణము 3
నీ విచ్చు ధననిధులైన – మా బిడ్డలు – కేవలము నీ దాసులై – భావివారి మణుల – రేమున భాసిల్ల – నీవే వారిని భృశము – ప్రోవుమాయు వొసంగి ||దేవా||
చరణము 4
రేపుమాపి గృహమున – బ్రోక్తములగుచున్ దీపించు ప్రార్థనముల – లోపరహితంబులుగా – ధూపదీపములట్లు – నీ పాదయుగళమున – గనుపింపనిమ్మేప్పుడూ ||దేవా||
చరణము 5
ఏ రోగమును నెప్పుడేని – మా మందిరపు – ద్వారంబు చొరనీయక – ఆరోగ్యం భాగ్యదే – యంతకించి మమ్ములను – భూరికృపాబ్ధివై – పోసింపుమను దినము ||దేవా||
చరణము 6
ఇరుగుపొరుగు వారలతో – సమాధాన – పరతవసింపను నేర్పి – కొరగాని కలహములు – త్వరపెట్టనివాని – భరింపదగు సహన – భావంబు మా కిమ్ము ||దేవా||
చరణము 7
బీదసాదల కెల్లరకు – మా గృహమెప్పు – డాదరణాస్పదమై యుండ – నీ దానసారంబు – నెరవరించిన కొలది – నౌదార్య గుణము మా – యందున బెంచుము సొరిది ||దేవా||
చరణము 8
నక్కలకు బొరియలుండు – కవి పక్షులకున్ – జక్కని గూళ్ళు నమరు – నొక్కొంతింకన్ యిక్కడ – నెక్కడలేదు నెన – చక్కని నరసుతమా – సదనంబునకు రమ్ము ||దేవా||