#564

దైవాశీర్వాదము

రాగం: శంకరాభరణము · తాళం: ఆది · రచయిత: అల్లూరి పెద్దవీరాస్వామి

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవర నీ – దీవెనలు – ధారాళముగాను వీరిపై – బాగుగ వేగమె దిగనిమ్ము – పావన యేసుని ద్వారా గాను ||దేవర||
చరణము 1
దంపతులు దండిగ నీ – ధాత్రిలో వెలయుచు సంపదలతోన్ – సొంపుగ నింపుగ పెంపగుచు సంహీంపున వీరు సుఖించుటకై ||దేవర||
చరణము 2
ఈ కవనము నీ కరుణన్ – ఆకరువరకును లోకములో – శోకము లేకయు నేకముగా ప్రాకటముగాను జేకొనుము ||దేవర||
చరణము 3
ఇప్పటికి నెప్పుడును – గొప్పగు ప్రేమతో నొప్పుచు దా – మొప్పిన చొప్పునన్ దప్పకను – మెప్పగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర||
చరణము 4
తాపములు పాపములు – మోపుగ వీరిపై రాకుండగాన్ – కాపుగా ప్రాపుగ దాపునుండి – యాపదలన్నియున్ బాపుచును ||దేవర||
చరణము 5
సాధులుగాన్ చేయుటకై – శోధనలచే నీవు శోధింపగాన్ – కదలకు వదలకు ముదమున నీ – పాదము దాపునన్ బాదుకొనన్ ||దేవర||
చరణము 6
మెండుగ భూమండలపు – గండములలో వీరుండగను – తండ్రిగ దండిగ నండనుండి – వెంబడియు వానిని ఖండించవే ||దేవర||
చరణము 7
ఇద్దరు వీరిద్దరును – శుద్ధులై నిన్ను సేవించుటకై – శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ పడన్ – కిద్దము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర||
చరణము 8
వాసిగ నీ దాసులము – చేసిన యీ మొరల్ తీసికొని – మా సకలేశ్వరి నీ సుతుడౌ – యేసుని పేరిటన్ బ్రోవుమామేన్ ||దేవర||