#563

వివాహము

రాగం: జంఝూటి · తాళం: ఆది

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
మానవుల మేలు కొరకు – జ్ఞానియైన దేవుడు – మానుగ కల్యాణ పద్ధతి – మహిని నిర్ణయించెగా ||మానవుల||
చరణము 1
కానాయను నూరిలో మన – కర్తచూచె పెండ్లిని – పానముగాను ద్రాక్షారసము – దానమొసగె ప్రీతిని ||మాനవుల||
చరణము 2
యేసూ వీరిద్దరిని – ఏకముగాను చేయుమీ – దాసులుగాను చేసి వీరి దోషము లేడబాపుమీ ||మాനవుల||
చరణము 3
కర్త వీరికు భార్య – భర్తల ప్రేమంబును – బూరిగా నిచ్చి వీరి బొందుగాను నడుపుమీ ||మానవుల||
చరణము 4
భక్తియు విశ్వాస ప్రేమలు – భావమందు వ్రాయుమీ – ముక్తి శరణి వెదక వీరి భక్తి మిగుల జేయుమీ ||మానవుల||