చరణము 1
2. దయనుంచవయ్యా యీ – దంపతులమీద స – దయుడవౌచు గాపాడు – తండ్రివలెను – నియమంబుగా వీరు – నీ చిత్తమును జరిపి – భయము లేకుండగా – బ్రతుక నిమ్ము ||కానా|| 3. ఒప్పు మీరంగ జేయు – నొప్పందము వీర – లెప్పుడును మదిలోన – నిడుకొనుచును – దప్పకుండగ దాని – నిప్పుడమిలో నెప్పుడు – గొప్పగా నెరవేర్ప – గూడ నుండు ||కానా|| 4. చక్కగా నెగడించ – సంసార భారంబు – నెక్కువగు నీ యాత్మ – నిప్పుడొసంగి – నిక్కమగు శరణిలో – నెక్కువగా నడిపించి – గ్రక్కునను దీవించు – కరుణానిధీ ||కానా|| 5. పిల్లలను నీవొసంగ – బ్రియంబుతోడ దేవ – పెల్లుగా బోధింప – నెరవొప్ప చూపు – మెల్ల వేళలలోన – నిరుకు మార్గము నందు – జల్లగా నడిపింప – శక్తి నిమ్ము ||కానా||