#559
వివాహము – మంగళార్చన
పల్లవి · Pallavi
మంగళము క్రీస్తునకు – మహిత శుభవార్తునకు – మంగళము త్రిత్వ స – మాత్వతునకు మంగళము దూత జన – మకుట మగు ప్రభువునకు – మంగళము వేదాంత – మాన్యునకును – జయమంగళము – సదా శుభ మంగళము ||జయ||
చరణము 1
కానాకున్ జనుదెంచి – కల్యాణమును మహిమ – గా నొనరింపను నీరు – గాంచి ద్రాక్షా – పానముగా మార్చి నీ – ప్రథమాద్భుత ప్రతిష్ఠ – భానుతుడ తెలుపు – మానితముగా ||జయ||
చరణము 2
నీకు సంఘమునకు – నిత్యమైన వివా – హైకత్వమునకున్ దగు – నెచ్చరికగా – గైకొనడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరణిని నిముడుగాక ||జయ||
చరణము 3
ప్రేమానుబంధమున – బెనగి యీ దంపతులు – వేమారు నీ మహిమ – వెదకి భువిని – కామాదులను గెల్చి – కైవల్య పురమునకు – క్షేమమగు కృపనిచ్చి – చేరనిమ్ము ||జయ||
చరణము 4
ఆదికాలమునాటి – యబ్రాహము శారా లెంతో – నీ దయలో బ్రతికి యిలా – నెగడినట్లు – ఈ దీన దంపతులు – గాదికచే బ్రతుకుటకు – నీ దయారస మొసగు – మక్షయముండా ||జయ||
చరణము 5
సంతానము గాంచి – సద్భక్తిలో బుద్ధి – మంతులై క్రైస్తవ – మతము నందు – అంత్యపర్యంతంబు – నణకువగా బెంచ నా – ద్యంత రహితుండ సహాయమిమ్ము ||జయ||
చరణము 6
కర్తయైన క్రీస్తు – కరుణయు దేవుని – పరమపూర్ణ ప్రేమ – ప్రబలము గాను – సురుచిరం బగు పరి – శుద్ధాత్మ నైక్యత – కలుగుగాక దంప – తుల కనిశము ||జయ||