#560
దైవాశీర్వాదము
పల్లవి · Pallavi
ప్రభు మార్గములయందే – భయ భక్తి నిండి – శుభరీతి నడిచే – పురుషుండే ధన్యుడు ||ప్రభు||
చరణము 1
అప్పుడు నీచే కష్టం – బారగించుదువు – ఎప్పుడు ధన్యుడవు నీ – కిలమేలౌగాక ||ప్రభు||
చరణము 2
నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షాలత – గెల పోలి నీ భార్య – ఫలమిచ్చునుగాక ||ప్రభు||
చరణము 3
పిల్లలెల్ల ఒలీవ మొక్క – పెంపువలె నీదు – బల్లచుట్టుకొని శో – భిల్లుదురు గాక ||ప్రభు||
చరణము 4
ప్రభున కిదిగో భీతి – పడువాడి రీతి – విభవంపు దయనొంది – వికసించునుగాక ||ప్రభు||
చరణము 5
ప్రభు సీయోనునుండి – ప్రశస్త కృపను – ప్రబలంబుగా నిచ్చి – బ్రతికించునుగాక ||ప్రభు||
చరణము 6
అరయ బ్రతికెడు రోజు – లన్నిట నీవు – యెరూషలేము క్షేమంబు – నెప్పుడు గాంచెదవు ||ప్రభు||
చరణము 7
నీదు పిల్లల పిల్లలు – నిజమిశ్రాయేలు – మీది క్షేమముచూచి – మోదమొందెదరు ||ప్రభు||
చరణము 8
తండ్రి కుమార శుద్ధాత్మకు – మహిమ – మెండై యుగయుగములందుండుగా కామేన్ ||ప్రభు||