చరణము 1
నేను బీద చిన్న పిల్లవాడను – నా బుద్ధి స్వల్పమైనది – నా దివ్య యేసు కొరకు – నేనేమి చేయగలను?నిత్యంబు చిన్న పనులు – నేను చేయవచ్చును – నా చిన్న తప్పులన్నియు – నేను చక్క పెట్టవచ్చును.మనస్సునందు కోపము – రాబోవునప్పుడు – నా కన్నులెఱ్ఱ చేయక – నేను ఓర్చుకొనవచ్చును.నేను తిన్నగాను నడుచుచు – నలుగురితోడ మెలగుచు – ఇల్లంత వెలిగించుచు – నలరింపగలను.నేను ఎంత చిన్న పిల్లనైనా – నాకుండు చిన్న బాధలకు – నా యేసుకై యుల్లాసమున్ – తాళి ప్రేమ స్తోత్రము నర్పింపగలను.