#555

బాలల జన్మదినోత్సవము

రాగం: ఖమాసు (ఛాయ: ఎంత చక్కని యేసు పుట్టె మనకు) · తాళం: త్రిపుట · రచయిత: తూలూరి ప్రకాశము

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఆశీర్వాదము నీయుమ – మా పరమజనక – యాశీర్వాదము నీయుమ – ఆశలుదీరంగ – నాయు వొసంగుచు – వాసిగ కరుణను – వర్ధిల్ల బిడ్డకు ||ఆశీర్వాదము||
చరణము 1
యేసు పెరిగిన యటులే – నీ దయయందు – ఈసు బిడ్డను పెంచుము – వాసిగ మనుజుల కరుణయందున బెరుగ – భాసుర వరమిచ్చి – బాగుగ బెంచుము ||ఆశీర్వాదము||
చరణము 2
నెనరు మీరగ మోసెను – నెమ్మదియందు – తనర బెంచినట్లుగ – ఘనముగ నీ శాంతి – సంతోషములయందు – తనర నీ బిడ్డను – తగు రీతి బెంచుము ||ఆశీర్వాదము||
చరణము 3
ఏ రీతి సమూయేలును – నీ సన్నిధిలో – నేపుగ బెంచితివో – యా రీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు – కోరి పెంచుము ప్రభువ – కోర్కెలూరంగ వేగ ||ఆశీర్వాదము||
చరణము 4
సత్య విశ్వాసమునందు – చక్కగ బెరుగ – శక్తి యొసంగినడుపమా – సత్య వాక్యమునందు – సరగను వర్ధిల్ల – నిత్యము నీ కృప – నిచ్చి బ్రోవుము ప్రభువ ||ఆశీర్వాదము||
చరణము 5
భక్తి ప్రేమల నీ బిడ్డ – బాగుగ బెరుగ – శక్తినియ్య మా ప్రభువ – ముక్తి పథంబున ముద్దుగ నడువంగ – యుక్తజ్ఞానము నిచ్చి – యుద్ధరించుమ ప్రభువ ||ఆశీర్వాదము||