#551

ఏలాపాట

రాగం: శంకరాభరణము · తాళం: ఆట · రచయిత: మిక్కిలి దేవసహాయము

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
కన్యా గర్భమున బుట్టి – కరుణగలుగు బాలుడవైన – కన్యా సుతుండ నిన్నే నమ్మితి – నా యేసునాథ – కన్నులెత్తి మమ్ము చూడుము ||కన్యా||
చరణము 1
బాల ప్రాయమున నేను – బాగుగా నీ పాద సేవ – జాలజేసి యున్నవాడనుగా – యో యేసునాథ – చాల దయతో మేలు చేయుమి ||కన్యా||
చరణము 2
ఇంపై నట్టి మరియ తనయ – ఇహము పరము నేలు బాల – సొంపుగా నీ ప్రాపే కోరితి – నా యేసునాథ – చెంప గొట్టి బుద్ధి చెప్పుము ||కన్యా||
చరణము 3
తుంటరితనము చేత జగము – తంటాచేసి తిరుగుచుంటి – నంతటి మాయల బాధల – నా యేసునాథ – యంటు బాపి జంటచేయుము ||కన్యా||
చరణము 4
మింట నుండి నీవు వచ్చి – మంటి పైన బాలుడవగుచు – గంటి కంటి కింపుగాను నడిచితి – వో యేసునాథ – కానుపించి తోవు త్రోవను ||కన్యా||