#550
యేసు నా కొరకు ప్రాణమిచ్చెను
పల్లవి · Pallavi
కల్వరియున్నంత దూరము వెళ్ళెను – నా కొరకు నా కొరకు – కల్వరియున్నంత దూరము వెళ్ళెను – నా ప్రియ రక్షకుడు ||
చరణము 1
తన రక్తమెంతో ధారపోసెను – పోసెను పోసెను – తన రక్తమెంతో ధారపోసెను – నా ప్రియ రక్షకుడు ||
చరణము 2
నా పాప శాపమంత క్రీస్తు బాపెను – బాపెను – బాపెను – నా పాప శాపమంత క్రీస్తు బాపెను – నా ప్రియ రక్షకుడా ||
చరణము 3
చావును జయించి మరల లేచెను – లేచెను లేచెను – చావును జయించి మరల లేచెను – నా ప్రియ రక్షకుడు ||
చరణము 4
తన యాత్మతోడు సమకూర్చెను – కూర్చెను కూర్చెను – తన యాత్మతోడు సమకూర్చెను – నా ప్రియ రక్షకుడు ||
చరణము 5
నీతి త్రోవయందు నన్ను నడుపును – నడుపును నడుపును – నీతి త్రోవయందు నన్ను నడుపును – నా ప్రియ రక్షకుడు ||
చరణము 6
మరల వచ్చి తన యొద్ద చేర్చును – చేర్చును చేర్చును – మరల వచ్చి తన యొద్ద చేర్చును – నా ప్రియ రక్షకుడు ||
చరణము 7
శృంగారమైన మోక్షము నాకు చూపెను – చూపెను చూపెను – శృంగారమైన మోక్షము నాకు చూపెను – నా ప్రియ రక్షకుడు ||