#549

క్రీస్తునందు బాలలు ఒక్కటే

రాగం: యదుకులకాంభోజి (ఛాయ: తనువు నాదిదిగో) · తాళం: త్రిపుట · రచయిత: సి. విజయ చార్లెస్

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఏ దేశస్థులమైన – ఏ జాతి మనదైన – యేసులో మన మొక్కటే – ఏకమై బాలల – మెల్లరమును తండ్రి – నెంతో స్తుతించుచు నెప్పుడు పాడుదము ||ఏ||
చరణము 1
పలు దేశములలోన పన్నుగా దేవుని – ప్రార్థించెడి బాలలం – పరమ తండ్రి మాలో – ప్రతివారి దీవించు – బహుగా నీ దినమనుచు – బ్రతిమాలి వేడుదము ||ఏ||
చరణము 2
బహు దేశములలోన – పలువిధములుగా ప్రాకెడి బాలలం – ప్రభుడే యేసుని కొరకే – ప్రపంచమంతటిని – బాగుచేయను మిగుల – ప్రయాసపడుదము ||ఏ||