#552

అభినయ క్రిస్మస్ గీతము

రచయిత: చెట్టి భానుమూర్తి

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
బాల యేసుని చూడరే కరు – ణాలవాలని పాడరే – కాల పూర్ణత చూచి దేవుడు – కొమరుడై జన్మించెనే ||బాల||
చరణము 1
దూతలారా రండి రండి – బేత్లేహేమున బుట్టిన – నూతనాద్భుత శిశువు చూచి – స్తోత్రగీతముల్ పాడరే ||బాల||
చరణము 2
గొల్లలారా రండి రండి – గొప్ప యుత్సవ మొందరే – ఎల్ల జనులకు రక్షణం బని – యంతటను చాటించరే ||బాల||
చరణము 3
జ్ఞానులారా రండి రండి – కానుకల నర్పించరే – దీనులను రక్షించ దేవుడు – మానవుండై బుట్టెను ||బాల||
చరణము 4
భక్తులారా రండి రండి – భజన పాటలు పాడరే – ముక్తిరాజగు యేసు ప్రభు మన – మధ్యనే జన్మించెను ||బాల||
చరణము 5
లోకుందరూ రండి రండి – ఏకమై కీర్తించరే – నీకరుండౌ యేసు క్రీస్తుడు – శ్రీ లొసంగగ వచ్చెను ||బాల||