#543
ఆదర్శముల ననుకించుట
పల్లవి · Pallavi
అనుకరించెద – నేను – అనుదినమును బాల యేసు – ననువుగాను జ్ఞానమునందును వయస్సునందును దే – వుని ప్రేమను మానవుల దయ – నను బెరిగిన బాల యేసు ||అనుకరి||
చరణము 1
పరదేశంబున వసించి – పరమాత్ముని మది దలచి – దురితమును జయించిన స – చ్చరింతుడనైన యోసేపు ||అనుకరి||
చరణము 2
తల్లి యాజ్ఞ నెరవేర్చి – తమ్ముని కష్టములు దీర్చి – యెల్లకాలముండు కీర్తి – నిల గడించిన మిర్యాము ||అనుకరి||
చరణము 3
పాలు మరచినది మొదలు – ప్రభు సేవ సంపదలు – ఆలయంబున బూనిన సు – బాలకుండు సమూయేలు ||అనుకరి||
చరణము 4
శత్రువులను బరిమార్చి – మిత్రులకు జయంబొనర్చి – స్తోత్రగీతములు రచించిన – సుందరుండౌ దావీదు ||అనుకరి||
చరణము 5
పరులకు న్యాయంబు దీర్ప – ప్రజలకు క్షేమంబు గూర్ప – పరమ వివేకంబు గోరి – ప్రభు నడిగిన సొలొమోను ||అనుకరి||
చరణము 6
యజమానునికి ఖ్యాతి గాంచి – స్వజనుల దేవుని గురించి – నిజ సాక్ష్యమిడి సన్మా – నించిన హెబ్రీయు బాల ||అనుకరి||
చరణము 7
అపవిత్ర రాజ భోజ – నాదుల విడి దైవ పూజ – గపట మింత లేక చేసి – ఘనత నొందిన దానియేలు ||అనుకరి||
చరణము 8
ప్రార్థన కూటమున జేరి – ప్రత్యుత్తర మప్పుడే కోరి – సార్థకముగా బేతురుని – సమాచార మిడిన రొదె ||అనుకరి||
చరణము 9
భక్తి భయములందు బెరిగి – బహు ప్రదేశములను తిరిగి – శక్తి కొలది సంఘ పరి – చర్య నొనర్చిన తిమోతి ||అనుకరి||