#544
దేవుడు మంచివాడు
పల్లవి · Pallavi
దేవుడు భలే మంచివాడు – ధరణిని బాలించువాడు – ఈవులు ఇచ్చువాడు – నెలరిని గాచువాడు ||దేవుడు||
చరణము 1
తండ్రి వంటివాడు మనకు – ధరణిని పోషించువాడు – దండ్రి ప్రియుడు నందరికి – దగినవాని నొసగువాడు ||దేవుడు||
చరణము 2
అన్నవస్త్రములను గాక – యన్నిటిని ఇచ్చువాడు – మన్ననతో బ్రోచువాడు – మనతో నెప్పుడు మెలగువాడు ||దేవుడు||
చరణము 3
కష్ట బాధలందు మనల – గని కరముతో గాచువాడు – దుష్టమనసు తీసివేసి – యిష్టముతో నుండువాడు ||దేవుడు||