#542

ధన్యులైన పిల్లలు

రాగం: ముఖారి · తాళం: త్రిపుట · రచయిత: జాన్ హే

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
వారు ధన్యు లైన పిల్లలు – భూలోకమందు – వారు ధన్యులైన పిల్లలు – కోరి విచారమును ప్రభుని – సార వాక్య మెదను బెట్టి – వారి వారి హితరులైన – వారికిని విధేయులైన ||వారు||
చరణము 1
అన్నదమ్ములందు నెటులను – తనతోడ నాడు – చున్న రితరులందు నటులను – భిన్న మెంచ కొక్కరీతి – దన్నుబోలె ప్రియమొనర్చి – తిన్నని బడియందు నేర్చు – చున్నవార లెవ్వరో ||వారు||
చరణము 2
ఒక్కడే తండ్రియు నతడు దేవుడు – మన కందరకును – సకల సుఖములిచ్చు నెప్పుడు – అకట మన మింకను జగడము – లాడదగదు ప్రభుని రీతి – నొక్క నొక్కడు ప్రియము చేసి – యుండుదమని తలచుచుండు ||వారు||
చరణము 3
మంచి మేలులనుభవించగా – కరుణించి దేవు – డెంచి మనల నిచట గూర్చెగ – వంచనల ద్యజించి కనిక – రించి యొకరి నొక్కడు మది స – హించి మంచి క్రియలతో వ – ర్తింప నిశ్చయింతు రెవరో ||వారు||
చరణము 4
ఆకాశమున నున్న దేవుడు – మన మనసు రాక – పోక లన్ని చూచు నెప్పుడు – ఏకముగా హృదయములు వి – వేకమున వెలుంగ జేసి – ప్రాకటముగా ప్రభుని యాజ్ఞ – గైకొనియెడి వార లెవరో ||వారు||