#539

ఉదయ ప్రార్థన

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవ కావవే – నేడు మమ్ములను – నీవు రాత్రి కాచినావు – నీకు స్తోత్రము ||దేవ||
చరణము 1
ఆపదలు మమ్మును – అంటకుండను – కావుమయ్య నేడు నీదు – కరుణ తోడను ||దేవ||
చరణము 2
నేటి కార్యంబుల్ – నేడు చేయగా – సూటియైన త్రోవ మాకు – చూపుమో ప్రభో ||దేవ||
చరణము 3
చెడ్డ కార్యంబుల్ – చేయకుండను – దొడ్డ బుద్ధి ఇచ్చి మమ్ము నుద్ధరించుము దేవా ||దేవ||