#538
బాల ప్రార్థన
పల్లవి · Pallavi
పిల్లనైన నన్ను చూడుమీ – ప్రియమైన యేసు – చల్లని రక్షకుండవనుచు – సత్యవార్త దెలుపుచుండ – నల్ల మందు నిన్ను నమ్మి – కల్ల లేక వేడుకొందు ||పిల్ల||
చరణము 1
నిన్ను నమ్మి యున్నవాడను – ఘన దేవతనయ – నన్ను దాచ నీ నీడను – తిన్నని హృదయంబు నాకు – జేనుగా నొసంగి యిప్పుడు – సన్నుతింప నిమ్ము – నన్ను – సాధువైన నిన్ను దలచి ||పిల్ల||
చరణము 2
ప్రేమచేత నొప్పుచుంటివి – ప్రేమా స్వరూప – ప్రేమలోన నడుచుచుంటివి – ప్రేమ లేని నన్ను బ్రోవ – బ్రేమచేత బ్రాణమిచ్చి – ప్రేమ చూపుమనుచు నన్ను – ప్రీతి చేత బోధింప ||పిల్ల||
చరణము 3
పరమ జనకు చిత్తమెప్పుడు – పరమేశ పుత్ర – బిరబిరగాను చేయుగా నిమ్ము – కరుణ మీర నాత్మచేత – వరవరంబు లొసగి నాకు – నరులలోన నిన్ను గొలువ – ధరణి మీద నన్ను నిలుప ||పిల్ల||
చరణము 4
బలము మీర నన్ను నిలుపుము – తుల లేనివాడ – బలము గలుగు నీదు చేతుల – నిలను నీకు ఫలము ఇచ్చి – యెలమి నిన్ను గొప్ప చేయ – సలలితముగా – నడువ నిమ్ము – చక్కని నీ మార్గమందు ||పిల్ల||